Suspension of Petroleum Purchases from 31st in AP .. Confederation of Dealers Notice
mictv telugu

ఏపీలో 31 నుంచి పెట్రోలియం కొనుగోళ్ల నిలిపివేత.. డీలర్ల సమాఖ్య ప్రకటన

May 27, 2022

Suspension of Petroleum Purchases from 31st in AP .. Confederation of Dealers Notice

ఏపీలో పెట్రోలియం డీలర్ల సమాఖ్య శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం కొనుగోళ్లతో నష్టాలు వస్తున్న నేపథ్యంలో ఈ నెల 31 నుంచి చమురు కంపెనీల నుంచి పెట్రోల్ ఉత్పత్తులు కొనకూడదని ఏకాభిప్రాయానికి వచ్చింది. ఈ మేరకు డీలర్ల సమాఖ్య విజయవాడలో సమావేశం నిర్వహించింది. అందులో పలు కీలక అంశాలపై చర్చ నిర్వహించారు. చివరగా పై నిర్ణయం తీసుకున్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు, వాటికి అనుగుణంగా దేశంలో ధరలను మార్చడం లేదన్న అంశం ప్రముఖంగా చర్చకు వచ్చింది. అనంతరం ప్రతినిధులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంతో పాటు చమురు కంపెనీల నిర్ణయాలతో డీలర్లకు భారీ నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. ధరలను పెంచినప్పుడు పైసలలో పెంచుతారు, తగ్గించేటప్పుడు రూపాయల్లో తగ్గిస్తారు. దాని వల్ల డీలర్లు చాలా నష్టం చవిచూడాల్సి వస్తోంది అని అభిప్రాయపడ్డారు. అంతేకాక, 2017 నుంచి ఎక్సైజ్ సుంకాన్ని మూడు సార్లు పెంచారు కానీ, డీలర్ల కమీషన్లలో ఏ మాత్రం మార్పు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పై విషయాలను పరిగణనలోకి తీసుకొని పెట్రోలియం ఉత్పత్తులు కొనుగోలు చేయకూడదని నిర్ణయించామని వారు తెలిపారు.