Suspicious death of key Taiwan defense official
mictv telugu

తైవాన్‌ కీలక అధికారి అనుమానాప్పద మ‌ృతి.. చైనాపై అనుమానం?

August 6, 2022

చైనా, తైవాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తైవాన్‌లో రక్షణ శాఖకు చెందిన కీలక అధికారి శనివారం అనుమానాస్పదంగా మృతి చెందారు. రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ యూనిట్ డిప్యూటీ హెడ్ ఒయు యాంగ్ లి హిసింగ్ అనే అధికారి దక్షిణ తైవాన్‌లోని ఓ హోటల్‌లో విగతజీవిగా కనిపించారు. యాంగ్ తైవాన్ యొక్క క్షిపణి అభివృద్ధి అధికారిగా కూడా కొనసాగుతున్నారు. అయితే మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అక్కడి అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, తైవాన్ చుట్టూ చైనా చేస్తున్న సైనిక విన్యాసాలపై ఆ దేశం మండిపడింది. తమ దేశపు జలసంధిలో యుద్ధ విన్యాసాలు, నౌకలు భారీ సంఖ్యలో మొహరించి ఉన్నాయని, కొన్ని చోట్ల నియంత్రణ రేఖ దాటి తమ జలాల్లోకి ప్రవేశించాయని తైవాన్ రక్షణ వాఖ శనివారం వెల్లడించింది. చైనా ప్రణాళిక ప్రకారం తమ దేశాన్ని కబళించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. అటు శనివారం నుంచి ఆగస్టు 15 వరకు లైవ్ ఫైర్ డ్రిల్ చేయనున్నట్టు బీజింగ్ తాజాగా ప్రకటించింది. కాగా, ఇప్పటికే తైవాన్‌‌పై ఆర్ధిక ఆంక్షలు విధించిన చైనా.. ఇప్పుడు సైనిక చర్యకు దిగేలా సన్నాహాలు చేస్తుండడంపై అమెరికా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.