బెంగళూరు మెట్రో స్టేషన్లో ఉగ్రవాది.. సిటీలో టెన్షన్ - MicTv.in - Telugu News
mictv telugu

బెంగళూరు మెట్రో స్టేషన్లో ఉగ్రవాది.. సిటీలో టెన్షన్

May 8, 2019

బెంగళూరు పోలీసుల గుండెలు దడదడలాడుతున్నాయి. శ్రీలంక ఉగ్రవాదులు నగరంలోకి చొరబడినట్లు వచ్చిన వార్తలు నిజం కాదని తేలడంతో ఊపిరిపీల్చున్న కొన్నిరోజులకే ఓ వ్యక్తి కలకలం రేపాడు. చిక్కినట్టే చిక్కి తప్పించుకుపోయిన ఆ అనుమానిత ఉగ్రవాది కోసం నగరాన్ని జల్లెడ పడుతున్నారు. అతని వద్ద తుపాకీ ఉండడంతో ఎప్పుడే జరుగుతోందోనని జనం కూడా భయపడుతున్నారు. ముఖ్యంగా మెట్రో రైలు ప్రయాణికులు బితుబితుకుమంటున్నారు.

Suspicious man creates security scare at Bangalore metro station metal detector entrance check police on hunt in the wake of Sri lanka church blast

మెజస్టిక్ మెట్రో రైల్వేస్టేషన్‌లోకి సోమవారం రాత్రి ఒక వ్యక్తి వచ్చాడు. మెటల్ డికెక్టర్ ద్వారం గుండా వచ్చేయగా, అక్కడి సిబ్బంది తనిఖీ చేయబోయారు. అతడు తనిఖీకికి నిరాకరించాడు. కానీ సిబ్బంది డికెక్టర్ పెట్టగా, అనుమానితుడి కోటు కింద నుంచి బీప్ అని శబ్దం వచ్చింది. బెల్టుకు ఏవో చుట్టుకున్నట్లు కనిపించాయి.  దీంతో అతణ్ని ఆపేయబోగా, పారిపోయాడు. తర్వాత అతడు మరో ద్వారం గుండా స్టేషన్లోకి వెళ్లడానికి యత్నించగా అక్కడా బీప్ శబ్దం వినిపించింది. అతణ్ని పట్టుకోవడంలో విఫలమైన తనిఖీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అతణ్ని పట్టుకోడానికి నగరంలో పలు చోట్ల సోదాలు సాగుతున్నాయి. అనుమానితుడు కుర్తా వేసుకున్నాడని, పొడవు గడ్డం ఉందని, హిందీ మాట్లాడాడని మెట్రో సిబ్బంది చెప్పారు. శ్రీలంకలో 300 మందిని చంపేసిన ఉగ్రవాదులు భారత్‌లో దాడుల కోసం బెంగళూరు చేరుకున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో ఇప్పటికే భద్రత కట్టుదిట్టం చేశారు.