అన్ని పూర్తైనా అనుకోని కారణాల వల్ల కొన్ని సినిమాలు విడుదలవ్వవు. ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాలకు ఈ బెడద ఎక్కువగా ఉంటుంది. అలాంటి సినిమానే ‘సువర్ణ సుందరి’. సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో 2018లో ప్రారంబైన ‘సువర్ణ సుందరి’ తెలుగు, కన్నడ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కింది. జానపద చిత్రం బ్యాక్ డ్రాప్ లో నిర్మించిన ఈ మూవీ రిలీజ్ డేట్ ని దాదాపు మూడున్నర ఏళ్ళ క్రితం అనౌన్స్ చేశారు. కానీ ఇంతవరకు విడుదల కాలేదు. కరోనా లాక్ డౌన్, థియటర్స్ కష్టాలు, లాస్ట్ కాపీ చిక్కులు వంటి అనేక అడ్డంకుల్ని అధిగమించి ఎట్టకేలకు ‘సువర్ణ సుందరి’ విడుదలకు సిద్ధమైంది. 2019లో మే 31న అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నామని మేకర్స్ ప్రకటించినా.. కేవలం కన్నడలో మాత్రమే ఈ సినిమా విడుదలైంది. ఇక కర్ణాటకలో రిలీజ్ అయిన మూడున్నరేళ్ల తర్వాత ఫిబ్రవరి 3న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఈ చిత్రం విడుదలవుతోంది. ఇక అదే రోజు సుహాస్ చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’ కూడా విడుదలవుతోంది.
అలాగే ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత వస్తున్న ‘సువర్ణ సుందరి’ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో చూడాలి. ఇక కన్నడలో విడుదలైన ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం. టెక్నీకల్లి రిచ్ గా ఉండటంతో థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ సంతృప్తి వ్యక్తం చేయగా.. అదే టాక్ తెలుగు రాష్ట్రాల్లో కూడా రానుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘సువర్ణ సుందరి’ అనే విగ్రహం చుట్టూ తిరిగే ఈ కథ 15వ శతాబ్దంలో జరుగుతుంది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయని ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఎంఎస్‌ఎన్ సూర్య ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, నాగినీడు, అవినాస్ ఎలందూరు, సాయికుమార్, రామ్ మద్దుకూరి, సత్యప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి :
పఠాన్ గ్రాండ్ పార్టీ.. అందరిముందే బోరున ఏడ్చేసిన షారుక్ ఖాన్ భార్య..!
Pathaan Movie Collections : పఠాన్ దెబ్బకు కేజీఎఫ్-2 రికార్డు బద్దలు