సుజుకీ కొత్త మోడల్ స్కూటర్.. ఫీచర్స్ ఇవే.. - MicTv.in - Telugu News
mictv telugu

సుజుకీ కొత్త మోడల్ స్కూటర్.. ఫీచర్స్ ఇవే..

January 7, 2020

Suzuki

సుజుకీ నుంచి సరికొత్త మోడల్‌లో యాక్సెస్ 125 స్కూటర్‌ను లాంచ్ చేసింది ఆ సంస్థ BS6 ఉద్ఘారాలకు అనుగుణంగా ఈ బైక్ తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి దేశవ్యాప్తంగా BS6 ప్రమాణాలు అమలులోకి వస్తున్న సంగతి తెలిసిందే. దాని కంటే ముందుగానే తాజా ఫ్యామిలీ స్కూటర్‌ను విడుదల చేశారు. సరికొత్త ఫీచర్స్‌తో దీన్ని లాంచ్ చేసినట్టు ఈ సంస్థ ఎండీ కొయిచిరో హిరాన్ వెల్లడించారు. 

ఈ సరికొత్త మోడల్‌ స్కూటర్‌లో .. అల్లాయ్‌ డ్రమ్‌ బ్రేక్, అల్లాయ్‌ డిస్క్‌ బ్రేక్, స్టీల్‌ డ్రమ్‌ బ్రేక్‌,LED హెడ్‌లైట్,  బాహ్యంగానే పెట్రోల్ క్యాప్, డిజిటల్ స్క్రీన్ అందుబాటులో ఉన్నాయి. దీనికి ఢిల్లీ ఎక్స్ షోరూం ధర రూ. 64,800 ఉండగా.. స్పెషల్‌ ఎడిషన్‌ ధర రూ. 69,500గా ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. సరికొత్త మోడల్‌లో వచ్చిన ఈ స్కూటీ తమ వినియోగదారులను ఆకట్టుకుంటుందని ఆ సంస్థ ధీమా వ్యక్తం చేస్తోంది.