అమెరికాలో మరో బ్యాంక్ మూతపడింది. అక్కడి అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ను మూసేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇధి ఇప్పడు ప్రపంచ వ్యాప్తంగ బ్యాంకింగ్ రంగం మీద ప్రభావం చూపించనుంది. స్టార్టప్ కంపెనీలకు నిధులు ఇచ్చే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూతతో ఇప్పుడు చాలామంది రోడ్డున మీద పడనున్నారు. లక్షమంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
37,000 కన్నా ఎక్కువ స్టార్టప్ సంస్థలు సిలికాన్ వ్యాలీ బ్యాంకులో అకౌంట్స్ కలిగి ఉన్నాయి. వీటిలో 10 వేలకుపైగా ఈ బ్యాంకుతో పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలను నిర్వహిస్తుంటాయి. ఇప్పుడు ఆ లావాదేవీలన్నీ ఆగిపోయాయి. సిలికాన్ వ్యాలీ నుంచి ఎలాంటి నిధులు రావడం లేదు. ఈ ప్రభావం ఉద్యోగులపై తప్పక ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఒక్కో కంపెనీ 10 మంది ఉద్యోగులను తొలగించినా లక్షకుపైగా ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూతపడితే తమ పరిస్థితి ఘోరంగా తయారవుతుందని అంటున్నారు కస్టమర్లు.తమను ప్రభుత్వం ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నారు. 3,500 మంది సీఈఓలతో సంతకాలు చేసిన లేఖను ఆర్థిక మంత్రి జానెట్ యెల్లెన్‌కు పంపించింది వై కాంబినేటర్ అనే సంస్థ. ఇది అమెరికాలో టెక్నాలజీ స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తుంటుంది. మరోవైపు లేఖ రాసిన కంపెనీల సీఈఓలు, స్టార్టప్ కంపెనీలు, ఉద్యోగులందరూ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కస్టమర్లు కావడం గమనార్హం. సంతకాలు చేసిన కంపెనీల్లో భారత్‌కు చెందిన వి పేఓ, సేవ్ఇన్, సాలరీబుక్ వంటివి వారికి మద్దతు తెలిపాయి.