వెంకటేశ్వర భక్తి చానల్ నుంచి పోర్న్ లింక్  - MicTv.in - Telugu News
mictv telugu

 వెంకటేశ్వర భక్తి చానల్ నుంచి పోర్న్ లింక్ 

November 11, 2020

Svbc channel controversy .jp

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్వహిస్తున్న శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ మరో వివాదంలో చిక్కుకుంది. శతమానం భవతి కార్యక్రమం కోసం ఓ భక్తుడు మొయిల్‌ చేయగా అతనికి ఎస్వీబీసీ నుంచి పచ్చిబూతు లింక్ అందింది. ఎస్వీబీసీ ఉద్యోగి అతనికి ఓ పోర్నో  సైట్‌ లింకును ఈమెయిల్ చేశాడు. 

అవాక్కయిన సదరు భక్తులు వెంటనే టీడీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితోపాటు ఈవో జవహర్ రెడ్డిలకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపించిన అధికారులు ఎస్వీబీసీ చానల్లో ఐదుగురు ఉద్యోగుల్ని గుర్తించి అమానంతో విచారించింది. మరో 25 మంది సిబ్బంది తరచూ పోర్న్ వీడియోలు చూస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఎస్వీబీసీ చానల్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆఫీసు ఎదుట విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఎస్వీబీసీ చానల్ యాజమాన్యం నిర్వాకాల వల్ల ఇప్పటికే చెడ్డపేరు వచ్చిన సంగతి తెలిసిందే.