మంత్రివర్యా..ఇదేం పాడు పని... - MicTv.in - Telugu News
mictv telugu

మంత్రివర్యా..ఇదేం పాడు పని…

June 29, 2017

ఆయన కేంద్రమంత్రి..అయినా మనిషే కాదా.అది వస్తే ఎవరూ ఆపుకోలేరు.పోసేశారు…బహిరంగ ప్రదేశంలో.పాపం మంత్రి వర్యా ఆపుకోలేక అలా చేశారు గానీ ఫోటోలు తీసేటోళ్లు తీసేశారు. సోషల్ మీడియాలో పెట్టనే పెట్టారు. ఇవకేముంది స్వచ్ఛ భారత్ ఇదేనంటూ నెటిజన్లు ప్రశ్నించారు. ఇంతకు ఎవరా మంత్రి అంటే.

స్వచ్ఛభారత్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఉద్యమం చేపడుతుంటే… దానికి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ తూట్లు పొడిచారు. పరిసరాల పరిశుభ్రత పట్టించుకోకుండా బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను చూస్తే మంత్రి కారును ఆపి మరి సెక్యూరిటీ గార్డుల సంరక్షణలో బహిరంగంగా మూత్ర విసర్జన చేశారు. మంత్రులే ఇలా చేస్తుంటే ఎలా అని నెటిజన్లు మండిపడుతున్నారు. సభ్య సమాజానికి అసభ్య మెసేజ్ ఇచ్చిన కేంద్రమంత్రి అంటూ కామెంట్లు చేస్తున్నారు.