నిత్యాందన స్వాముల లీల గురించి కొత్తగ చెప్పాల్సిందేమీ లేదు. ఒక వేళ చెప్పాల్సొచ్చినా ఎంత ఎక్కువ చెప్తే అంత మంచిది. ఎందుకంటే తమిళనాడు స్వామి వారి లీలకు జనం సమ్మోహితులై…. వద్దు నాయనో అన్నట్లుంది. అందుకే స్వాముల వారు కర్నాటక రాష్ట్రం గిరిజన తండాలపై పడ్డట్లుంది. కర్నాటక రాష్ట్రం మారుమూల ఏరియాలున్న కొండపై కన్నేసి… కొండనే కొట్టేయాలని అనుకున్నారట. పాపం స్వాముల వారు జనాలకు ఎంతో సేవ చేద్దామని అనుకున్నట్లుంది… ఏదో తనకు తోచిన దాంట్లో రెండు కుటీరాలు… అలౌకికానందం పొందేందుకు జానెడు జాగా ఉంటే చాలు గావొచ్చు. స్వామిజీని అర్థం చేసుకోకుండా లోకల్స్ అక్కడి నుండి వెళ్లగొట్టారట. భూములపై, జాగాలపై, సొమ్ములపై, మగువలపై ఏమాత్రం మామకారం లేని ఈ నిత్యానందం లాంటి వారి లీలను భక్తులు ఎప్పుడు గుర్తిస్తారో ఏందో.