కబ్జానా... అంటే ఏమిటి నాయనా.... - MicTv.in - Telugu News
mictv telugu

కబ్జానా… అంటే ఏమిటి నాయనా….

June 18, 2017

అంతా స్వామి లీల. ఏం చేసినా అంతా స్వాముల వారే.. అంతా అలౌకికానందం… అంతా మాయం.. మన చేతిలో ఏమీ లేదు…. భక్తులారా నేను చెప్పేది ఆలకించుడు….. ఆ టెంట్లు తీసుకెళ్లి ఆ గుట్ట మీద వేయండి… ఆ భూమిని కబ్జా చేయండి… అంతా మాయా… ఎవరి ఆస్తి ఎవరికి సొంతం… ఏదో ఉన్న నాలుగు రోజులు  అనుభవిస్తే చాలు….. ఇదీ  నిత్యానంద స్వాముల వారి లీల. ఇంతకు ముందే స్వాముల వారు నటి  రంజితతో  ప్రేమభక్తి పారవశ్యంలో ఎట్లా  మునిగి, ఈత కొట్టి తేలాడో… అంతా చూశారు. అప్పట్లో అదంతా అలౌకికానందం అని సెలవిచ్చారు… నిత్యా…. నంద స్వాముల వారు.. తాజాగా భూముల ఆక్రమణకు పూనుకున్నారు. బెంగుళూరు సమీపంలోని  ఓ కొండపై స్వామి కన్నే శారు. వెంటనే భక్తులు అక్కడ టెంట్లు వేశారు. ఈ విషయం గుర్తు వట్టిన కమ్యూనిస్టు పార్టీలు లొల్లి పెట్టాయి… స్వాముల వారికి వ్యూహానికి ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లుంది. ఇప్పటి వరకు స్వాముల వారిపై రేప్, చీటింగ్ కేసులు నమోదు  అయ్యాయి… తాజాగా భూ కబ్జా కేసు కూడా నమోదు అయింది. అంతా స్వాముల వారి లీల.