బీజేపీలోకి పరిపూర్ణానంద స్వామి - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీలోకి పరిపూర్ణానంద స్వామి

October 19, 2018

శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చికుంది. గురువారం ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్వామికి కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ.. మోదీ, అమిత్ షాతో కలిసి పనిచేసేందుకే బీజేపీలో చేరానని పేర్కొన్నారు. బీజేపీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.Swami Paripoornananda Joins In Bharatiya Janata Party In Delhi‘నేను ఆధ్యాత్మిక మార్గంలో ఎంత త్రికరణశుద్ధిగా పనిచేశాను. ఇప్పుడు బీజేపీ కోసం కూడా అలాగే పని చేస్తాను. నా సేవలు ఎక్కడ అవసరముంటుందో.. అక్కడికి నేను వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. దేశం కోసం, ధర్మం కోసం బీజేపీ పని చేస్తోందని ప్రశంసించారు’. పరిపూర్ణానంద తెలిపారు. పరిపూర్ణానందకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కాగా తెలంగాణలో జరిగే ముందస్తు ఎన్నికల్లో కూడా ఆయన బరిలోకి దిగబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.