Swami Vairagyananda was arrested by the police
mictv telugu

భక్తురాలిపై స్వామీజీ అత్యాచారం.. దేవతే చేసిందని బుకాయింపు

August 9, 2022

టెక్నాలజీ పెరుగుతున్న ఈ ఆధునిక కాలంలో కొంతమంది బాబాలు, స్వామీజీలంటూ మోసపోతూనే ఉన్నారు. ఆధ్యాత్మికత విషయంలో అయితే ఏమో అనుకోవచ్చు కానీ, సంతానం కోసం బాబాల వద్దకు వెళితే ఏం జరుగుతుందో ఓ మహిళకు స్పష్టంగా తెలిసొచ్చింది. అత్యాచారం చేసి తర్వాత దేవతే ఇలా చేసిందంటూ బుకాయించిన స్వామీజీపై మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ కేసు పెట్టింది. తనను తాను దేవుడిగా ప్రకటించుకొని ప్రజల్లో చెలామణి అవుతున్న స్వామి వైరాగ్యానంద స్వామీ తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని పూజలు చేస్తే పిల్లలు పుడతారని నమ్మించి ప్రసాదంలో మత్తు మందు కలిపి ఇచ్చాడని ఆరోపించింది. తర్వాత స్పృహ కోల్పోవడంతో స్వామీజీ తనపై అత్యాచారానికి పాల్పడ్డట్టు గుర్తించానని పేర్కొంది. అడిగితే దేవతే ఇలా చేసిందని చెప్తున్నాడని వాపోయింది. కాంగ్రెస్ పార్టీ పూర్తి అండ ఉండే ఆయనకు వ్యతిరేకంగా కేసు పెట్టాలంటే భయపడ్డానని, కానీ ఇప్పుడు ధైర్యం చేసి ఫిర్యాదు చేసినట్టు బాధిత మహిళ వెల్లడించింది. కాగా మహిళ ఫిర్యాదుతో కదిలిన పోలీసులు స్వామీజీని అరెస్టు చేశారు. ఈయన గతంలో దిగ్విజయ్ సింగ్ తరపున హోమం కూడా చేశాడు. దిగ్విజయ్ గెలవకపోతే సమాధిలోకి వెళతానంటూ ప్రగల్భాలు పలికాడు. కానీ మాట మీద నిలబడలేదు.