రాష్ట్రీయ హిందూ సేన షురూ - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్రీయ హిందూ సేన షురూ

November 1, 2017

కాకినాడలోని శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామి రాష్ట్రీయ హిందూ సేన పేరుతో ఒక హిందూ సంస్థను ఏర్పాటు చేశారు.బుధవారం తన జన్మదినం సందర్భంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ తహసీల్ మైదానంలో దీని ఆవిర్భావ సభను ఆయన నిర్వహించారు. హిందూధర్మం కోసం పాటుబడానికి భక్తులకు పిలుపునిచ్చారు. ‘హిందువులంతా విభేదాలకు అతీతంగా ఏక‌తాటిపైకి రావాలి. దేశంలో 80 శాతం ఉన్న హిందువుల‌పై దాడులు జ‌ర‌గ‌డం సిగ్గుచేటు కాదా?’ అని అన్నారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకంపై స్పందిస్తూ..  కొందరు కులాల మీద పుస్త‌కాలు రాస్తున్నారని అన్నారు. హిందూమత ర‌క్ష‌ణ కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశానన్నారు. కంచె ఐలయ్యతో ఓ టీవీ చానల్ జరిపిన చర్చలో పరిపూర్ణ పాల్గొనడం, స్వామి తల్లిదండ్రుల పేర్లు చెప్పాని ఐలయ్య అడగడంతో ఇద్దరి మధ్య గొడవ జరగడం తెలిసిందే.