swathi naidu angry comments on karate kalyani
mictv telugu

పురుషుల్లారా! అంతా ఏకమై రండి : స్వాతినాయుడు

May 16, 2022

swathi naidu angry comments on karate kalyani

కరాటే కల్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిల ఎపిసోడ్‌లో స్వాతినాయుడు కూడా ఉందన్న సంగతి జనం అంతగా పట్టించుకోలేదు. కల్యాణి శ్రీకాంత్‌తో పాటు స్వాతినాయుడిపై కూడా కేసు పెట్టినా నడిరోడ్డులో వారిద్దరూ కొట్టుకోవడంతో స్వాతి కాస్త వెనుకబడిపోయింది. అది గ్రహించిందే ఏమో.. తాజాగా స్వాతినాయుడు లైన్లోకి వచ్చింది. కరాటే కల్యాణిని ఏకిపారేస్తూ వీడియో రిలీజ్ చేసింది. ‘శ్రీకాంత్ రెడ్డిని వీడియోలు చేయవద్దని చెప్పడానికి ఆమె ఎవరు? దాడి చేయడం దారుణం.

తప్పనిపిస్తే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయాలి కానీ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా? ఎవరైనా సరే కొట్టడం తప్పు. అమ్మాయికి ఏదైనా జరిగితే మహిళా సంఘాలు వచ్చేస్తాయి. కానీ మగవారికి అన్యాయం జగితే అబ్బాయిలంతా సపోర్ట్ చేయాలి కదా. అయినా సినిమాల్లో లేని దాని కంటే శ్రీకాంత్ రెడ్డి ఎక్కువగా ఫ్రాంక్ చేస్తున్నాడా? అయినా అతని వీడియోలతో ఈమెకు ఇబ్బంది ఏంటి? ఎవరికి నచ్చినట్టు వారు చేస్తారు. ఒకరిని వేలెత్తి చూపడానికి ముందు మన బతుకులేంటో తెలుసుకోవాలి. నన్ను కూడా వీడియోలు తీయడం ఆపమంటుంది. అసలు ఆమె ఎవరు నాకు చెప్పడానికి. నేను ఒంటరిగా వచ్చాను. నా సొంతంగా సంపాదించుకుంటూ బతుకుతున్నా. నీకు ఇష్టం లేకపోతే చూడ్డం మానేయ్. నా సపోర్ట్ మాత్రం శ్రీకాంత్ రెడ్డికే’ అని తన అభిప్రాయాలను గట్టిగా వ్యక్తపరిచింది.