‘స్వాతి చినుకులు’ నటుడు భరద్వాజ్‌కు కరోనా - MicTv.in - Telugu News
mictv telugu

‘స్వాతి చినుకులు’ నటుడు భరద్వాజ్‌కు కరోనా

July 13, 2020

bfbfc

తెలుగు టీవీ సీరియళ్లు చిక్కుల్లో పడుతున్నాయి. పలువురు నటీనటులకు కరోనా సోకడంతో దర్శక నిర్మాతలు తల పట్టుకుంటున్నారు. వైరస్ సోకిన నటీనటుల పాత్రలను ఎపిసోడ్లలోంచి తీసేయడం, వారి స్థానంలో కొత్త నటులను పెట్టి అతుకుల బొంతలతో తిట్టించుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా ‘స్వాతిచినుకులు’, బంధం’ తదితర సీరియళ్లతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు భరద్వాజ్ రంగావజ్జులకు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలో తెలిపాడు. 

‘నాకు పైకి కరోనా లక్షణాలు కనిపించడం లేదు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. చక్కని ఆహార నియమాలు, మందులతో ఈ వైరస్ నుంచి బయటపడొచ్చు. నాతో కలిసి నటించిన వారు పరీక్షలు చేయించుకుని, ఐసోలేషన్‌లో ఉండాలి..’ అని భరద్వాజ్ కోరారు. ‘సూర్యకాంతం’, ‘గృహలక్ష్మి’, తదితర బుల్లితెర సీరియల్ నటులతోపాటు కొందరు యాంకర్లకు కూడా కరోనా సోకింది.