రేపిస్టులను ఉరి తీసేవరకు ఆమరణ దీక్ష - MicTv.in - Telugu News
mictv telugu

రేపిస్టులను ఉరి తీసేవరకు ఆమరణ దీక్ష

December 2, 2019

దేశంలో పెరుగుతున్న అత్యాచారాలపై  ఢిల్లీ మహిళా కమిషన్‌ (డీసీడబ్ల్యూ) చైర్‌ పర్సన్‌ స్వాతి మాలివాల్‌ మళ్లీ దీక్షకు దిగుతున్నారు. రేపిస్టులకు ఆరు నెలల్లోగా మరణశిక్ష విధించాలన్న డిమాండుతో ఆమె రేపటి (మంగళవారం) నుంచి ఆమె నిరాహార దీక్ష చేయనున్నారు. 

మహిళలపై లైంగిక దాడులకు తెగబడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. ‘రేపటి నుంచి జంతర్ మంతర్ వద్ద  నిరాహార దీక్షకు దిగుతున్నాను. రేపిస్టులకు 6 నెలల లోపు మరణ శిక్ష విధించేలా కేంద్రం హామీ ఇచ్చేంతవరకు దీక్ష చేస్తా..’ అని ఆమె చెప్పారు. స్వాతి మనివాల్ గతంలోనూ అత్యాచారాలకు వ్యతిరేకంగా 10 రోజులపాటు దీక్ష చేశారు. 12 యేళ్ల లోపు బాలికలపై  రేప్ కేసుల్లో దోషులకు మరణశిక్ష పడేలా కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయడంతో దీక్ష విరమించారు.