14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదికగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహార్ నూతన రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్‌నాథ్ కోవింద్‌తో పోటీపడిన యూపీఏ పక్షాల అభ్యర్థి మీరా కుమార్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. నూతన రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన కోవింద్‌కు ప్రణబ్ ముఖర్జీ అభినందనలు తెలిపారు.