ఒక చిప్ ధర రూ. 785.. ఏందయ్యా స్పెషల్ అంటే..  - MicTv.in - Telugu News
mictv telugu

ఒక చిప్ ధర రూ. 785.. ఏందయ్యా స్పెషల్ అంటే.. 

August 19, 2019

బంగాళదుంప చిప్స్ అంటే చాలా మందికి ఇష్టం. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా లాగించేస్తుంటారు. ఎన్ని తిన్నా.. తినాలనిపిస్తూనే ఉంటాయి. చేతిలో రూ. 5 లేదా రూ. 10 ఉంటే సరిపోతుంది. కానీ మనం చెప్పుకోబోయే చిప్స్ ధర వింటే మాత్రం మతిపోవాల్సిందే. కేవలం ఐదంటే ఐదు  చిప్స్ మాత్రమే ఉండే ఒక్క ప్యాకెట్ ధర రూ. 4 వేలు పెట్టి అమ్ముతున్నారు. ఇంతకీ ఎందుకు ఆ చిప్స్‌కి అంత ధర.. దానిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.

స్వీడన్‌కు చెందిన ‘సెయింట్ ఎరిక్’ అనే స్వదేశీ బ్రావరీ సంస్థ ఈ ఖరీదైన చిప్స్ తయారు చేసి అమ్ముతోంది. జువెల్లరీ బాక్స్‌ను తలపించేలా తయారు చేసిన ఓ ఫ్యాక్ లో ఐదు చిప్స్‌ను ప్యాక్ చేసి మరీ  వినియోగదారులకు అందిస్తున్నారు. దీని ధర 56 డాలర్లుగా నిర్ణయించారు. అంటే ఒక్కో చిప్ ధర రూ. 785 అన్నమాట. ఈ ప్యాక్ ఆ సంస్థకు చెందిన సర్టిఫికెట్ కూడా ఉంటుంది.

ఈ చిప్స్ ప్రత్యేకతలు ఇవే :  

ఈ చిప్స్‌కు ఇంత ధర పలకడానికి కూడా ఓ ప్రత్యేక కారణం ఉంది. దీని తయారీకి ఉపయోగించే ఉల్లిపాయలు లేక్‌సండ్‌ నగరంలో మాత్రమే లభించే అరుదైన జాతి ఉల్లిపాయలను వాడుతున్నారు. వీటిని నిష్ణాతులైన చెఫ్స్ తయారు చేస్తారు. ఐదు చిప్స్ 5 రకాల రుచిని కలిగి ఉంటాయి. ఇంతటి ఖరీదైన పదార్థాలు, ప్రత్యేక పద్దతుల్లో తయారు చేస్తారు కాబట్టి వీటికి అంతటి ప్రాధాన్యత ఉందని ‘సెయింట్ ఎరిక్’ సంస్థ ప్రతినిధులు అంటున్నారు. ఈ చిప్స్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా చెబుతున్నారు. ఇంత ధర ఉన్నా చిప్స్ ప్రియులు వీటిని ఇష్టపడి మరి కొనుక్కోవడం విశేషం.