Swedish village, now residents want its name changed
mictv telugu

బూతు బూతు.. ఆ ఊరు పేరు రాస్తే మీ అకౌంట్ బ్లాక్

October 27, 2022

Swedish village, now residents want its name changed

కొన్ని ఊర్లపేర్లు వినడానికి చాలా ఇలా ఇబ్బందిగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉందీ సమస్య. ఘోరాలు, నేరాలు, బూతులు వంటి వాటిని గుర్తుకు తెచ్చేలా ఉండే పేర్లతో సమస్యలు అన్నీ ఇన్నీ కావు. చెప్పుకోడానికి, రాసుకోడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. గతంలో ఎవరో చేసిన పనికి ఊరికి ఊరే అలాంటి సిగ్గుతో చితికిపోతుంటుంది. అందుకే వాటి పేర్లు మార్చాలని జనం ప్రభుత్వాలను అర్జీలు పెడుతుంటారు. ఈ చిక్కుసమస్యలు ఇప్పుడు సోషల్ మీడియాకూ ఎక్కాయి.

ఓ ఊరి పేరు ఫేస్‌బుక్ వంటి సోషల్ సైట్లలో రాస్తుంటే అకౌంట్లు బ్లాక్ అవుతున్నాయి. విచిత్రంగా ఉన్నా ఇది నిజం. అందుకే ఆ ఊరివాళ్లూ పేరు మార్చండని కోర్టుకెక్కారు. స్వీడన్‌లోని ఫకే అనే చెరువు పక్కన అదే పేరుతో ఫూక్ (ఫకే) పేరుతో శతాబ్దాల నాటి గ్రామం ఉంది. ఉండేది 11 ఇళ్లే. ఫక్ అనే ఆంగ్లపదాన్ని గుర్తుకు తెచ్చే ఈ పేరుతో ఊరోళ్లకు చాలా సమస్యలు వస్తున్నాయి. ఫేస్ బుక్’లో తమ ఊరు పేరు ప్రస్తావిస్తుంటే అకౌంట్లు బ్లాక్ అవుతున్నాయని వాపోతున్నారు. ‘‘మేం చీమకు కూడా అపకారం తలపెట్టం. ఎన్నో ఏళ్ల నుంచి ప్రశాంతగా జీవిస్తున్నాం. ఎప్పుడో పెట్టిన పేరుతో మాకు సంబంధం లేదు. దాని వల్ల చాలా ఇబ్బందిపడుతన్నాం. దయచేసి మార్చండి,’’ అని సాంస్కృతిక శాఖకు వినతి పత్రం అందజేశారు.