రండి రండి.. చక్కగా వాయిస్తా.. తినండి.. - MicTv.in - Telugu News
mictv telugu

రండి రండి.. చక్కగా వాయిస్తా.. తినండి..

October 15, 2018

కాదేదీ కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కవిత్వానికే కాదు సంగీతానికి కూడా అనర్హమైందీ ఉండదు. వంటింట్లో గరిటెల భీకర సంగీతం చాలామందికి సుపరిచితమే. అయితే వాటితో ఊరకే వాయిస్తూ కూర్చుంటే వంట కాస్తా మాడిపోతుంది. కానీ ఆ గరిటెనే కాస్త పాత్రలకేసి సున్నితంగా , లయబద్ధంగా, నైపుణ్యంగా వాయిస్తే వినసొంపుగా ఉంటుంది.

ఈ వీడియో చూస్తే మళ్లీ ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం ఉండదు. తమిళనాడు కోయంబత్తూరులోని బ్రూక్‌ఫీల్డ్స్ మాల్ వద్ద ఉంటాడీ వాయిద్యాకారుడు. స్వీట్ కార్న్ అమ్ముతుంటాడు. కస్టమర్లకు వాటితో పాటు టక్ టక్.. డుర్ డుర్.. కిటకిట.. సంగీతాన్ని బోనస్‌గా అందిస్తుంటాడు. కార్న్, మసాలా, నిమ్మరసంతోపాటు ఈ సంగీతం కూడా శ్రవణోపేతంగా ఉండడంతో జనం ఎగబడుతున్నారు. కార్తీక్ శ్రీనివాసన్ అనే వ్యక్తి కార్న్ కచేరీని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో సదురు వ్యాపారి ప్రతిభ గురించి లోకానికి తెలిసింది.