టీటీడీ భక్తులకు తీపి కబురు - MicTv.in - Telugu News
mictv telugu

టీటీడీ భక్తులకు తీపి కబురు

March 4, 2022

9

తిరుమల తిరుపతి దేవస్థాన ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి భక్తులకు ఓ తీపి కబురు చెప్పారు. శ్రీవారి ఆర్జిత సేవలు వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని, ఏప్రిల్ మొదటి వారంలో ఆర్జిత సేవల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నామని శుక్రవారం ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తిరుమలలోని అన్నప్రసాద కౌంటర్లు పరిశీలించారు. అనంతరం సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ”ఆర్జిత సేవలు, దర్శనాల టికెట్ల ధరలు పెంచే ఆలోచన లేదు. గత సమావేశంలో ధరలు పెంచే అంశంపై చర్చ మాత్రమే జరిగింది. రెండేళ్ల తర్వాత తిరుమలలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. భక్తులు ఒకేచోట చేరకుండా మరో 2 ప్రాంతాల్లో అన్నప్రసాద పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం” అని వై.వి సుబ్బారెడ్డి తెలిపారు.