మొదలైన కేసీఆర్ ప్రసంగం..నెలకొన్న ఉత్కంఠ - MicTv.in - Telugu News
mictv telugu

మొదలైన కేసీఆర్ ప్రసంగం..నెలకొన్న ఉత్కంఠ

March 9, 2022

mghmg

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 7వ తేదీన మొదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రెండవ రోజున బుధవారం అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభమైయ్యాయి. కేసీఆర్ బుధవారం 33 జిల్లాల నిరుద్యోగులు టీవీలు చూడండి గొప్ప ప్రకటన చేయబోతున్నా అని మంగళవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో యావత్ తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ యువత టీవీలకు అత్తుకున్నారు. ఎప్పుడెప్పుడు కేసీఆర్ ఉద్యోగాల గురించి ప్రసంగిస్తారు అని ఎదురుచూస్తున్నారు.

మరీ జాబ్‌ క్యాలెండర్‌నా? నిరుద్యోగ భృతినా?..తెలంగాణలోని నిరుద్యోగులకు కేసీఆర్‌ ఎలాంటి వరాలు ప్రకటించనున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఉద్యోగాల భర్తీ కోసం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయనున్నారా? లేదా నిరుద్యోగ భృతి ప్రకటించనున్నారా? అన్నదానిపై సందిగ్ధత కొనసాగుతోంది. అయితే జాబ్‌ క్యాలెండర్‌ వైపే సర్కారు మొగ్గుచూపే అవకాశాలున్నాయని, సుమారు లక్ష ఉద్యోగాల భర్తీపై కేసీఆర్‌ కీలక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది.