మహారాష్ట్ర గెలుపుపై ధీమా.. లడ్డూలు సిద్ధం చేసిన బీజేపీ - MicTv.in - Telugu News
mictv telugu

మహారాష్ట్ర గెలుపుపై ధీమా.. లడ్డూలు సిద్ధం చేసిన బీజేపీ

October 24, 2019

 

bjp....

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై బీజేపీ పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తోంది. కౌంటింగ్ ప్రారంభం కావడంతో బీజేపీ ముందంజలో ఉంది. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో చేతులెత్తేయడంతో పాటు ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ – శివసేన కూటమికి అనుకూలంగానే వచ్చాయి. గెలుపుపై ధీమాతో బీజేపీ రాష్ట్ర శాఖ కౌంటింగ్‌కు ముందే 5వేల లడ్డూలు, పెద్దసంఖ్యలో పూలదండలు సిద్ధం చేశాయి. 

ఉదయం 8 గంటలకు కౌంటిగ్ ప్రారంభం కావడంతో ఫలితాలపై పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 288 స్ధానాలకు గాను బీజేపీ-శివసేన కూటమికి 197 నుంచి 211 మధ్య స్ధానాలు వస్తాయని దాదాపు 11 ఎగ్జిట్‌ పోల్స్‌  వెల్లడించాయి. రెండోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందనే ధీమాతో విజయోత్సవాలకు సిద్ధం అయ్యారు. మధ్యాహ్నం వరకు పూర్తి తుది ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.