అరుంధతి, బాహుబలి లాంటి.. సినిమాలతవో అగ్రహీరోయిన్ గా వెలిగిపోయింది అనుష్క శెట్టి. ఈ ముద్దుగుమ్మ సైజ్ జీరోతో బొద్దుగుమ్మ గా మారింది. అప్పటి నుంచి బయటకు కనిపించలేదు. రెండేండ్ల తర్వాత ఇప్పుడు ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ అగ్రహారోయిన్ గా వెలుగొందింది స్వీటీ. ఈమె ముందు కమర్షియల్ సినిమాల్లో కనిపించింది. కానీ అరుంధతి సినిమా తర్వాత మాత్రం ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో కనిపించడం మొదలు పెట్టింది. దశాబ్ద కాలంగా తనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ వచ్చింది. సోషల్ మీడియాకు మాత్రం ఈ ముద్దుగుమ్మ దూరంగా ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో శివరాత్రి వేడుకలకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
శివరాత్రిని ఒక్కొక్కరూ ఒక్కోలా సెలబ్రిటీ చేసుకున్నారు. హీరోలు, హీరోయిన్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే ఇందులో అనుష్క సెలబ్రేషన్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. శివరాత్రి సందర్భంగా ఆమె బెంగళూరులో ఈ సెలబ్రేషన్స్ జరుపుకొన్నది. తెల్లని దుస్తుల్లో దేవకన్యలా కనిపిస్తున్న అనుష్కను చూసి ఆమె అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. కానీ ఆమె మునుపటిలాగే బొద్దుగా కనిపించడంతో కొందరు మాత్రం స్విటీ కాస్త చిక్కితే చూడాలనుకుంటున్నట్టు కామెంట్స్ చేస్తున్నారు.
అనుష్క 2020లో నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా అప్పుడు తప్ప మళ్లీ అనుష్క బయట కనిపించింది లేదు. రెండేండ్లు గడిచిన తర్వాత అనుష్క ఇప్పుడు కనిపించింది. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమాలో కనిపించబోతున్నది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు.