ఈ తెలుగు అమ్మాయి రష్యన్ల హృదయాలను గెలుచుకుంది ! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ తెలుగు అమ్మాయి రష్యన్ల హృదయాలను గెలుచుకుంది !

July 8, 2017

భయానికి భాష అక్కర లేదని అంటాడు ఓ తెలుగు సిన్మల హిరో. మరి పాటకు… దానికీ అంతే. పాటకు, ఆటకు  భాషతో సంబంధం లేదు. అందులోని గాన మాధుర్యం మనస్సులను కట్టి పడేస్తుంది.  ‘‘వారాయ్…. రారా’’ అనే పాట గుర్తుందా… ఈ  పాట ఒక్క సారి  విన్నామంటే మర్చిపోవడమనేదే ఉండదు. ఈ పాట… దీనికి తగ్గ డ్యాన్స్ కార్యక్రమం రష్యా జనాలను ఫీదా చేసిందట. రష్యాగాట్ టాలెంట్ షో కోసం స్వెత్లానా తులసీ అనే 26 ఏండ్ల అమ్మాయి స్టేజీపై అద్భుథ: అనే  లెవల్లో  పెఫార్మెన్స్ ఇచ్చిందట. ప్రేక్షకులు  మంత్రముగ్ధులయ్యారట.

ఈ పేరు రష్యా అమ్మాయిదే అయినా పక్కన తులసీ  ఉంది కదా. ఎవరో ఇండియన్ అనుకుంటున్నారు కదా.  ఈ అమ్మాయి మన తెలుగు అమ్మాయే.  తులసీ వాళ్ల తండ్రి తెలుగు వ్యాపార వేత్త. తల్లి రష్యన్. అక్కడే పుట్టి పెరిగింది  స్వెత్లానా తులసి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కథక్ నృత్యం నేర్చుకున్నది. ఢిల్లీలోని కథక్ కేంద్ర యూనివవర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. రష్యాలో ఎకతెరీనా అనే రష్యన్ మహిళ వద్ద  డ్యాన్స్ నేర్చుకున్నదట. ఈమెకు 13 ఏండ్ల వయస్సులో తండ్రి చనిపోయాడట. అప్పటి నుండి  తన తండ్రికి నివాళిగా నృత్యప్రదర్శనలు చేస్తున్నదట  తులసి. టీవి ఛానెళ్లలో వచ్చే చాలా ప్రోగ్సామ్స్ పాల్గొని విజేతగా నిలిచిందట.

ఇప్పుడిలా రష్యాన్ ప్రేపక్షకుల హృదయాలను కొల్లగొట్టంది స్వెత్లానా తులసి. మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటుతున్నది తులసీ. మనమూ ఆల్ ది బెస్ట్  అందాం.