స్విగ్గీ సంస్థ షాకింగ్ నిర్ణయం.. డెలివరీ బాయ్స్‌కు పండగే - MicTv.in - Telugu News
mictv telugu

స్విగ్గీ సంస్థ షాకింగ్ నిర్ణయం.. డెలివరీ బాయ్స్‌కు పండగే

April 4, 2022

12

ఫుడ్ డెలివరీ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థలో ఐదారేళ్లుగా పనిచేస్తున్న డెలివరీ బాయ్స్‌లకు మేనేజర్లుగా మారే అవకాశమిచ్చింది. ఇందుకోసం సంస్థ నిర్వహించే ఇంటర్వ్యూల్లో పాల్గొనాల్సిందిగా వారికి సూచించింది. వెలుగులోకి వచ్చిన విషయాల ప్రకారం.. ఐదారేళ్లుగా పని చేస్తోన్న బాయ్స్ వారి అర్హతలు, ఆసక్తిని బట్టి ప్రమోషన్లు ఇస్తుంది. ఎంపికైన వారికి అందుకు తగ్గట్టే జీతాలను ఆఫర్ చేస్తోంది. సాధారణంగా డెలివరీ బాయ్స్‌కు నెల సంపాదన రూ. 15 వేల నుంచి రూ. 18 వేల వరకు ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రూ. 25 వేల వరకు రాబడి ఉంటుంది. అయితే మేనేజర్లుగా ఎంపికైన వారికి ఏడాదికి రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు జీతాలనిస్తోంది. ప్రాంత మేనేజర్ స్థాయికి చేరితే ఏడాదికి 11 లక్షల వరకు వేతనం పొందొచ్చు. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ఓ యువకుడు మేనేజర్‌గా ప్రమోషన్ పొందాడు. అతడిని చూసి మరింత మంది డెలివరీ బాయ్స్ తమ ప్రతిభను నిరూపించుకునే పనిలో పడ్డారు. కాగా, కంపెనీ ఇచ్చిన ఈ ఆఫర్ పట్ల డెలివరీ బాయ్స్‌లో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ఇన్నాళ్లూ ఎంత పని చేసినా అంతంత మాత్రం ఆదాయం కళ్లజూసిన వారు, ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. అలాగే తమ ప్రతిభకు సాన పెడుతున్నారు.