‘స్విగ్గీ మనీ’.. డబ్బులు వేసుకో, ఫుడ్డు తెచ్చుకో..   - MicTv.in - Telugu News
mictv telugu

‘స్విగ్గీ మనీ’.. డబ్బులు వేసుకో, ఫుడ్డు తెచ్చుకో..  

June 30, 2020

Swiggy Money Launched as Swiggy’s Digital Wallet to Enable Seamless Food Order Transactions

‘హంగర్ సేవర్’ అనే నినాదంతో వచ్చిన ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ రోజురోజుకు తన  వినియోగదారులను పెంచుకుంటూ పోతోంది. తాజాగా స్విగ్గీ వినియోగదారులకు మరింత చేరువ అవడానికి మరో సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. డిజిటల్ వ్యాలెట్‌ను రూపొందించినట్టు ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి ‘స్విగ్గీ మనీ’ అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కస్టమర్లకు ఈ ఫీచర్ మరింత సహాయకారిగా మారనుందని కంపెనీ నిర్వాహకులు ఆశాభావం వ్యక్తంచేశారు. ఫుడ్ ఆర్డర్ చేసుకునేందుకు వీలుగా దీనిని రూపొందించామని వెల్లడించారు. అయితే ఈ ‘స్విగ్గీ మనీ’లో ముందుగా కస్టమర్లు కొంత డబ్బును జమ చేసుకోవాలని.. ఆర్డర్ బుక్ చేసినప్పుడు అందులో నుంచి మనీ కట్ అవుతుందని స్పష్టంచేశారు. 

ఫోన్‌పే, అమెజాన్‌ పే, పేటీఎం తదితర డిజిటల్‌ వాలెట్లకు స్విగ్గీ మనీ గట్టి పోటీ ఇస్తుందని కంపెనీ భావిస్తోంది. ఆయా యాప్‌ల మాదిరి స్విగ్గీ మనీతో వినియోగదారులు ఇన్‌స్టాంట్‌ రీఫండ్లను కూడా పొందవచ్చు అని వివరించారు.  స్విగ్గీ యాప్‌ ఉన్న వినియోగదారులు ఫుడ్‌ ఆర్డర్‌ చేసే ముందు ఒక్కక్లిక్‌తో చెల్లింపులు చేయొచ్చు. కాగా, ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలేని  వారు కూడా ఏదైనా ప్రభుత్వ ఐడీకార్డు వివరాలను ఐసీఐసీఐ బ్యాంకుకు అందించడం ద్వారా వెంటనే వాలెట్‌ను  వినియోగించుకునే వీలుంటుందని అన్నారు. మొత్తానికి స్విగ్గీ తీసుకువచ్చిన ఈ సరికొత్త ఫీచర్‌ గల్లాపెట్టె మాదిరి డబ్బులు వేసుకో.. ఫుడ్డు తెచ్చుకోలా ఉంది కదూ.