ప్రతీ పండగకు సరికొత్త యాడ్‌తో తన బిజినెస్‌ను మార్కెట్ చేసుకునే ప్రముఖ డెలివరీ సంస్థ స్విగ్గీ ఈ సారి మాత్రం బొక్కొ బోర్లాపడింది. హోలీ పండగపై రూపొందించిన స్విగ్గీ యాడ్‌పై హిందూ సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.స్విగ్గీని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇంతటి వివాదానికి కారణమైన స్విగ్గీ యాడ్ ఏంటో ఒకసారి చూద్దాం.
హోలీ పండగ సందర్భంగా ఆన్‌లైన్ స్టోర్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఒక యాడ్‌ను రూపొందించింది. అందులో రెండు కోడి గుడ్లు పెట్టి పక్కన గుడ్లను ఆమ్లెట్ వేసుకోవడానికి వినియోగించడండి..కానీ ఎవరి తలమీద కొట్టడానికి కాదు అని అర్థం వచ్చేలే కొటేషన్స్ రాసింది. చివరగా బురామత్‌ఖేలో( తప్పుగా ఆడవద్దు), గెట్ హోలీ ఎసెన్షియల్ ఆన్ ఇన్‌స్టామార్ట్ అని హ్యాష్‌ట్యాగ్ జత చేసింది. దీనిని ఢిల్లీ-ఎన్సీఆర్లో ఏర్పాటు చేసిన ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ బిల్‌బోర్డుపై హిందూత్వవాదులు మండిపడుతున్నారు. హిందువుల పండగలను అవమానించొద్దు అంటూ హెచ్చరించారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. స్విగ్గీని బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. దీనిపై స్విగ్గీ అధికారికంగా స్పందించనప్పటికీ..సంబంధిత యాడ్స్‌ను తొలగించింది.