స్వైన్ ఫ్లూ కలకలం… చిత్తూరులో జనం బెంబేలు - MicTv.in - Telugu News
mictv telugu

స్వైన్ ఫ్లూ కలకలం… చిత్తూరులో జనం బెంబేలు

October 1, 2018

చిత్తూరు జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజల్లో నెలకొంటున్న భయాలను పాలద్రోలడానికి ప్రయత్నిస్తున్నారు.

కేరళ వెళ్లి వచ్చిన ముగ్గురు స్వైన్‌ఫ్లూ లక్షణాలతో తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. వారి వివరాలను వైద్యులు గోప్యంగా వుంచారని సమాచారం. కాగా స్వైన్ ఫ్లూ లక్షణాలు  గల కేసులు ఇంకా అధికారికంగా నమోదు కాలేవని అధికారులు చెబుతున్నారు.Swine flu ... People Feard in Chittor స్వైన్‌ఫ్లూ భయంలేదని, ఎవరూ ఆందోళన చెందవద్దని, ఎలాంటి పుకార్లను నమ్మవద్దని కలెక్టర్ ప్రద్యుమ్న స్పష్టం చేశారు. తిరుపతి స్విమ్స్‌లో స్వైన్ ఫ్లూ చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. స్వైన్‌ఫ్లూ‌కు సంబంధించి వైద్య అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.