అయ్యప్పకు కానుకలా.. స్వైప్ చేసేయండి! - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యప్పకు కానుకలా.. స్వైప్ చేసేయండి!

November 30, 2019

ఎక్కడ చూసినా క్యాష్‌లెస్ విధానం విపరీతంగా పెరిగిపోయింది. ఏ చిన్న వస్తువు కొనాలన్నా.. స్వైపింగ్ మిషన్లు, గూగుల్ పే లాంటి యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో జనాలు జేబుల్లో డబ్బు పెట్టుకోవాలసిన పనిలేకుండా పోయింది. ఈ విధానం ప్రస్తుతం ఆలయాలకు కూడా చేరింది. దేవునికి భక్తులు కానుకలు సమర్పించేందుకు చిల్లర లేదనే ఇబ్బంది లేకుండా తోచినంతగా స్వామివారికి కానుకలు ఇచ్చే అవకాశాన్ని కల్పించారు. ఈ విధానాన్ని శబరిమల ఆలయంలో భక్తుల సౌకర్యం కోసం తీసుకువచ్చారు. 

Swiping Machine.

అయ్యప్ప దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు వస్తుండటంతో ఆలయ ఆదాయంపై దేవస్థానం బోర్డు దృష్టిపెట్టింది. భక్తులు కానుకలు సమర్పించేందుకు క్యాష్ లెస్ విధానం తీసుకువచ్చారు. దీని కోసం కార్డు స్వైపింగ్  యంత్రాలు అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా క్రెడిట్, డెబిట్ కార్డులు ఉపయోగించి తోచినంతగా స్వామివారికి కానులకలు ఇవ్వవచ్చని ఆలయ బోర్డు వెల్లడించింది. భక్తుల సౌకర్యం కోసం ఆలయంలో మొత్తం నాలుగు చోట్ల వీటిని అమర్చారు. దీన్ని ఉపయోగించుకొని కానుకలు ఇవ్వాలని భక్తులకు సూచించారు. ఈ సౌకర్యం ఆలయం తెరిచి ఉన్నంత వరకే ఉంటుందని బోర్డు సభ్యులు వెల్లడించారు.