Switch eScrambler: Pre-Orders Now Open for the World’s First Electric Scrambler
mictv telugu

ప్రపంచపు తొలి ఎలక్ట్రిక్ ఆఫ్‌రోడ్ బైక్ ఇదే

July 25, 2022

పెట్రోల్‌తో నడిచే బైక్‌లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ బైక్‌లు మార్కెట్‌లో విపరీతంగా సేల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆఫ్‌రోడ్ బైక్‌ల విషయంలో కూడా ఎలక్ట్రిక్ కంపెనీలు ఆయా బైక్‌లను మార్కెట్‌లోకి దించడానికి రెడీ అవుతున్నాయి. ఇసుకలోనూ, మట్టిరోడ్లలోనూ ప్రత్యేకంగా నడిపేందుకు వీలుగా ఉండేలా న్యూజిలాండ్- చైనా బేస్డ్ EV కంపెనీ ‘Switch eScrambler’ అనే బైక్‌ను రూపొందించింది. వచ్చే ఏడాదిలో మార్కెట్‌లోకి తొలి ఇ-స్క్రాంబ్లర్‌ బైక్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ బైక్ ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది. 2023 మొదటి త్రైమాసికంలో ఈ విక్రయాలు ప్రారంభమవుతున్నాయి. స్విచ్ ఇ-స్క్రాంబ్లర్‌ అనేది మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్క్రాంబ్లర్ బైక్. కొంచెం రెట్రో, కొంచెం మోడ్రన్ లుక్ తో దీని డిజైన్ చూపరులను ఆకట్టుకుంటోంది.

చిన్నగా ఉండే కాంపాక్ట్ డిజిటల్ డాష్‌బోర్డ్‌ను కలిగి ఉన్న ఈ బైక్ స్క్రాంబ్లర్‌ విభాగంలో డుకాటి కంపెనీ గతంలో తీసుకొచ్చిన మోడల్‌ను పోలి ఉంది. 170 కేజీల బరువు ఉండే ఈ బైక్ మోనో సస్పెన్షన్‌తో వస్తోంది. 13kWh బ్యాటరీని అమర్చారు. 50kW ఎయిర్‌కూల్డ్‌ మోటార్‌ కలిగిన ఈ మోటార్‌ సైకిల్‌ 70hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 150 కి.మీ రేంజ్ అందిస్తుంది. బైక్‌ ధరను 11,999 అమెరికన్‌ డాలర్లుగా నిర్ణయించింది. మన కరెన్సీ ప్రకారం దాదాపు రూ.10 లక్షలు. ప్రపంచవ్యాప్తంగా డెలివరీలు అందిస్తామని కంపెనీ చెబుతోంది.