సైరా విడుదల దసరాకేనా? - MicTv.in - Telugu News
mictv telugu

సైరా విడుదల దసరాకేనా?

May 16, 2019

అనుకున్న తేదీకి సినిమాను విడుదల చేయాలని భావిస్తోంది ‘సైరా’ చిత్ర యూనిట్. ఈ క్రమంలో సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈమధ్య సెట్‌కు నిప్పు అంటుకుని, ఓ విదేశీ నటుడు వడదెబ్బకు చనిపోవడంతో సినిమా షూటింగ్‌కు ఆటంకాలు ఎదురయ్యాయి. అయితే సినిమా యూనిట్ మళ్లీ షూటింగ్ మొదలుపెట్టి సినిమాను ముగించాలనుకుంటోంది. ఈ క్రమంలో కోకాపేటలో చివరి షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది. చిరంజీవి, తమన్నాపై ఓ పాట, కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడంతో షూటింగ్ ముగుస్తుందట. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా ముగించి అనుకున్న ప్రకారం చిత్రాన్ని విడుదల చేయాలని పట్టుదలగా వుంది టీం.

Sye Raa Movie released Dussehra day.

భారీ బడ్జెట్‌తో పాటు చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.  సినిమా రిలీజ్ డేట్ విషయంలో అనేక తేదీలు అనుకున్నా చివరగా అక్టోబర్ 2వ తేదీనే ఫిక్స్ చేశారు. అక్టోబర్ 8న విజయ దశమి కావడంతో ఆ సెలవులను క్యాష్ చేసుకోవడానికి అక్టోబర్ 2 వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, నయనతార, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్నారు. రామ్ చరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.