సైరా నరసింహరెడ్డి టీజర్ ప్రోమో.. పవన్ స్పెషల్ అట్రాక్షన్ - MicTv.in - Telugu News
mictv telugu

సైరా నరసింహరెడ్డి టీజర్ ప్రోమో.. పవన్ స్పెషల్ అట్రాక్షన్

August 19, 2019

సైరా నరసింహరెడ్డి సినిమా టీజర్ ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాన్ వాయిస్ ఓవర్ ఇస్తుండగా తీసిన వీడియోను అందులో చేర్చారు. చిరంజీవి, పవన్ కల్యాన్ ఇందులో ఉన్నారు. ఈ సందర్భంగా వాయిస్ ఓవర్ చెబుతూ పవన్ కల్యాన్ సైరా నరసింహరెడ్డి అంటూ ఆవేశంగా చెప్పడం కనిపిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రేపు విడుదల కానున్న నేపథ్యంలో ముందుగానే ప్రోమోను విడుదల చేశారు. 

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందుకోసం ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నారు. స్వాతంత్రోద్యమ సమయంలో ఆయన తెగువను ఇందులో చూపిస్తున్నారు. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా కొణిదెల రాంచరణ్ నిర్మాతగా ఉన్నారు. పవన్ కల్యాన్ సినిమా పరిచయానికి వాయిస్ ఓవర్ అందించారు. దీనికి సంబంధించిన వీడియో విడుదల కావడంతో మోగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.