Home > Featured > సింహంలాంటోడు దొరా…. సైరా టీజర్ ఇలా

సింహంలాంటోడు దొరా…. సైరా టీజర్ ఇలా

మెగా అభిమానులను అలరిస్తూ ‘సైరా’ టీజర్‌ను కాసేపటి కింద విడుదల చేశారు. ‘చరిత్ర స్మరించుకుంటుంది.. కానీ చరిత్రపుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు..రేనాటి సూర్యుడు ’ అంటూ పవన్ కల్యాణ్ గంభీరమైన గొంతుకతో మొదలయ్యే టీజర్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి పరిచయం చేశారు.

బ్రిటిష్ పాలకులతో నరసింహారెడ్డి పాల్గొనే యుద్ధసన్నివేశాలను కూడా చూపారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్.. మొత్తంగా టేకింగ్ అంతా హాలీవుడ్ స్థాయిలో ఉంది. కొణిదెల రాంచరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నరసింహారెడ్డిగా, నయనతార ఆయన భార్యగా నటించారు. తమన్నా, అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి ఇతర తారాగణం కాగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి మేకింగ్ వీడియోనును ఇటీవలే విడుదల చేశారు.

Updated : 20 Aug 2019 4:20 AM GMT
Tags:    
Next Story
Share it
Top