'సైరా' నటుడి మృతి.. వడదెబ్బ ఎఫెక్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

‘సైరా’ నటుడి మృతి.. వడదెబ్బ ఎఫెక్ట్

May 16, 2019

Syera narasimha reddy movie actor died due to temperatures.

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. వడ దెబ్బ తగిలి మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. తాజాగా సైరా చిత్రంలో నటించిన ఓ నటుడు వడ దెబ్బ తగిలి మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు చోటు చేసుకుంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఎండలు ఎక్కువగా ఉన్నా కూడా చిత్రబృందం ఇబ్బందులు పడుతూనే షూటింగ్ జరుపుతున్నది. అయితే సైరా సినిమాలో క్యారెక్టర్ నటుడిగా నటించిన రష్యా దేశస్థుడు అలెగ్జాండర్(38) వడదెబ్బ తగిలి మంగళవారం మృతి చెందాడు. చిత్ర బృందం సినిమాలో బ్రిటిష్ పాత్రల కోసం పెద్ద సంఖ్యలో విదేశీయుల్ని తీసుకొచ్చింది. వారిలో అలెగ్జాండర్ కూడా ఒకరు. అతను టూరిస్ట్ వీసా మీద రెండు నెలల క్రితం ఇండియా రావడం జరిగింది.