‘సైరా’ గురువుకి మరో అరుదైన పురస్కారం - MicTv.in - Telugu News
mictv telugu

‘సైరా’ గురువుకి మరో అరుదైన పురస్కారం

September 24, 2019

syeraa actor Amitabh Bachchan

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత నాలుగు దశాబ్దాలుగా సినీరంగంలో విశేషసేవలు అందించినందుకు గానూ అమితాబ్‌కు ఈ పురస్కారం ప్రకటించారు.

ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు. అమితాబ్ తెలుగు నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని విడుదల కాబోతుంది. ‘సైరా’లో అమితాబ్ గురు గోసాయి వెంకన్న పాత్రలో నటిస్తున్నారు. అమితాబ్ 1969లో విడుదలైన ‘సాత్ హిందుస్తానీ’ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.