మహానౌక.. ఒక ఊరిలా..8 వేలమంది.. - MicTv.in - Telugu News
mictv telugu

మహానౌక.. ఒక ఊరిలా..8 వేలమంది..

March 24, 2018

ఓడల్లో సింఫనీ ఆఫ్ సీస్ ఓడ కథే వేరు. ప్రపంచంలో అత్యంత పెద్దదైన ఈ నౌక శనివారం తొలి ప్రయాయానికి సిద్ధమైంది. దీనికి అన్ని ఫినిషింగ్ టచెస్ ఇచ్చి సెయింట్ నజరేలోని ఫ్రెంచ్ షిప్ యార్డులో రాయల్ కరీబియన్ దళానికి అందజేశారు.

చూడ్డానికి ఒక ఊరులా కనిపించే ఈ ఓడ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎప్పటిదో వందేళ్ల కిందట మునిగిన టైటానిక్‌కు  తాతలా ఉన్న ఈ నౌక తయారీకి రూ. 8700 కోట్లకుపైగా ఖర్చయింది. దీన్ని నిర్మించడానికి రెండేళ్లు పట్టింది.

ఇందులో 2200 మంది సిబ్బంది సహా మొత్తం 8000 మంది సుఖా ప్రయాణించొచ్చు. గంటకు 41 కి.మీ. వేగంతో వెళ్తుంది.

ఫీచర్లు..

బరువు 2,28,081 టన్నులు, ఎత్తు 238 అడుగులు, పొడవు 1,188 అడుగులు(362 మీటర్లు), 2,759 గదులు. ఓడలో క్లబ్బులు, సోర్ట్స్ మైదానాలు, చిన్నపాటి బీచ్,  హోటళ్లు మరెన్నో ఉన్నాయి. దీన్ని శనివారం ప్రారంభించారు. నజరే నుంచి మలాగాకు బలల్దేరింది. రోమ్ నగరాల్లో ఆగుతుంది. ప్రజల కోసం ఏప్రిల్ 7 నుంచి అందుబాటులోకి వస్తుంది.