Symptoms of dengue fever, Precautions to be taken
mictv telugu

డెంగీ ఫీవర్ లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

July 29, 2022

తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా వర్షాలు తెరిపిలేకుండా కురుస్తున్నాయి. వాతావరణంలో తేమ శాతం కూడా పెరగడంతో.. దోమలు, కీటకాలు విస్తారంగా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ. వర్షాకాలంలో దోమలు మరింత వ్యాప్తి చెంది డెంగీ వ్యాధులకు దారి తీసే అవకాశాలున్నాయి. ఇప్పటికే చాలా చోట్లు డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ఈ డెంగీ ఫీవర్ లక్షణాలు, వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స గురించి తెలుసుకుందాం. అధిక జ్వరం, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, అలసట, కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు, వికారం , వాంతులు డెంగీ లక్షణాలు. డెంగీ జ్వరానికి సకాలంలో చికిత్స చేయడానికి తక్షణ వైద్య సంరక్షణ అవసరం.

ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ఫుడ్‌ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డెంగీ జ్వరం నివారణిగా తిప్పతీగ రసాన్ని తీసుకోవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్యులు. రోజు ఓ కప్పు మరిగించిన నీటిలో కొన్ని చుక్కల తిప్పతీగ రసాన్ని కలిపి తీసుకుంటే డెంగ్యూ జ్వరం తగ్గుతుందని చెబుతున్నారు.

సిట్రస్ ఫుడ్స్ పుష్కలంగా ఉన్న అన్ని రకాల ఆహారాలు తీసుకుంటే డెంగీ వ్యాధితో పోరాడే తెల్ల రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. జామపండు, నిమ్మపండు రసాలతోపాటు బొప్పాయి ఆకు రసం తీసుకుంటే ప్లేట్‌లెట్ కౌంట్ పెరిగి జ్వరం తగ్గుముఖ పడుతుంది. వీటితో పాటు నానబెట్టిన మెంతులు, తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్, వెల్లుల్లి తరచుగా తీసుకుంటే డెంగ్యూ జ్వరాలు తగ్గుతాయి. మీలో డెంగీ లక్షణాలు కనిపించినట్లయితే, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు, సలహాలు డెంగీ జ్వరాన్ని సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడొచ్చు కానీ ఎక్కువ కాలం ఇంటి నివారణలపై ఆధారపడవద్దు.