Symptoms of monkeypox in a child in Vijayawada
mictv telugu

విజయవాడలో చిన్నారికి ‘మంకీపాక్స్’ ఫ్యామిలీ ఐసోలేషన్‌లో

July 17, 2022

మంకీపాక్స్ వ్యాధి విజయవాడలో కలకలం రేపింది. దుబాయి నుంచి వచ్చిన కుటుంబంలోని ఓ చిన్నారికి శరీరంపై దుద్దర్లు రావడంతో మంకీపాక్స్‌గా అనుమానిస్తున్నారు. చిన్నారి నమూనాలు సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబుకు పంపారు. చిన్నారికి విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తూ.. కుటుంబం మొత్తాన్ని ఐసోలేషన్‌లో పెట్టారు. ఈ విషయాన్ని వైద్యారోగ్య శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతుండగా, స్థానికులు మాత్రం హడలిపోతున్నారు. ఇటీవలే కేరళకు చెందిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి సోకిందని నిర్ధారణ అయింది.