ఒరేయ్.. ఒట్టి చేతులతో వచ్చా... - MicTv.in - Telugu News
mictv telugu

ఒరేయ్.. ఒట్టి చేతులతో వచ్చా…

September 4, 2017

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ‘సైరా.. నరసింహారెడ్డి’ షూటింగ్ మొదలుకాకముందే లీకేజీ సమస్య మొదలైంది. బ్రిటిష్ వాళ్లపై పోరాడిన రాయలసీమ పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా నిర్మిస్తున్న ఈ సినిమాలోని  పాపులర్ డైలాగ్ అంటూ మీడియాలో ఓ డైలాగ్ హల్ చల్ చేస్తోంది…

‘‘ఒరేయ్ నేను ఒట్టి చేతులతో వచ్చా.. నువ్వు భుజం మీద తుపాకీతో వచ్చావ్.. అయినా నా చెయ్యి మీసం మీదకి పోయేసరికి నీ బట్టలు తడిసిపోతున్నాయ్ రా”.. ఇదీ ఆ డైలాగ్. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. బ్రిటిష్ సైన్యాధికారితో అంటున్న సందర్భంలోనిది ఈ డైలాగ్ అని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. అయితే సినిమా టీం దీనిపై స్పందించడం లేదు.

ఈ డైలాగ్.. సూపర్ స్టార్ కృష్ణ తీసిన అల్లూరి సీతారామరాజులో రూథర్ ఫర్డ్ ను ఉద్దేశించి చెప్పే డైలాగ్ లా, మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఎన్టీఆర్ వల్లించే డైలాగులా ఉందని చెప్పుకుంటున్నారు