సైరా రెడ్డి.. సెట్‌పైకి వచ్చేశాడు..! - MicTv.in - Telugu News
mictv telugu

సైరా రెడ్డి.. సెట్‌పైకి వచ్చేశాడు..!

December 6, 2017

మెగాస్టార్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న శుభఘడియ రానే వచ్చిది. చిరంజీవి 151వ చిత్రం ‘సైరా’ షూటింగ్  బుధవారం ఉదయం హైదరాబాద్‌లో  ప్రారంభమైంది. సుందరంగా రూపొందించిన భారీ సెట్‌లో దర్శకుడు సురేందర్ రెడ్డి  రెగ్యులర్ షూటింగ్ షురూ చేశాడు.

సైరా నరసింహారెడ్డి మూవీ… కొణిదెల కంపెనీ ప్రొడక్షన్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతోంది.  మెగాస్టార్ పక్క నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రగ్యా జైశ్వాల్,  అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, సుదీప్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. బ్రిటిష్ పాలకులతో పోరాడి నేలకొరిగిన రాయలసీమ పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు.

The moment has arrived. Here we begin #SyeRaaNarasimhaReddy!! Join us & say #SyeSyeRaa

Posted by Konidela Production Company on Tuesday, 5 December 2017