సిరియా టు వరంగల్.. ర్యాలీకి నో అన్నందుకు ఆత్మహత్యాయత్నం - MicTv.in - Telugu News
mictv telugu

సిరియా టు వరంగల్.. ర్యాలీకి నో అన్నందుకు ఆత్మహత్యాయత్నం

March 3, 2018

సిరియా అంత్యర్యుద్ధంలో బలైపోతున్న చిన్నారుల చిత్రాలు సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో వస్తుండడం తెలిసిందే. మనసున్న ప్రతి వ్యక్తినీ ఇవి కదలిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సిరియా మారణకాండను వ్యతిరేకిస్తూ వరంగల్‌లోనూ ర్యాలీ తీయాలనుకున్నాడు ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ఎండీ.నయీం. అయితే పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించారు. ఇంటర్ పరీక్షలు, సరిహద్దులో ఎన్‌కౌంటర్ నేపథ్యంలో అనుమతివ్వలేమన్నారు. దీంతో మొదట డీజిల్ పోసుకుని, తర్వాత పురుగులు మందు తాగి ఫేస్‌బుక్ లైవ్‌లో ఆత్మహత్యకు యత్నించాడు.. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. మచిలీబజార్‌కు చెందిన నయీం జేపీఎన్‌రోడ్‌లో శాంతి ర్యాలీకి సిద్ధమయ్యాడు. పోలీసులు అనుమతించకపోవడంతో ఇంట్లో తన ఒంటిపై డీజిల్‌ పోసుకుని నిప్పంటించుకోబోయాడు. కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలిసిన కొందరు ర్యాలీకి అనుమతివ్వాలని మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు అప్పుడు కూడా నిరాకరించారు. తర్వాత జేపీఎన్‌రోడ్‌లోని ఓ హోటల్‌కు నయీం, అతని మిత్రులు వచ్చారు. నయీం తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగతూ ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెటాడు. సోషల్ మీడియాలో ఇది పాకిపోవడంతో ఇస్లాం ముస్లిం హక్కుల పోరాట సమితి కార్యకర్తలు అడ్డుకుని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. నయీం ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.