టీ-శాట్ చానళ్లు ఇక ఎయిర్‌టెల్ డీటీహెచ్‌లోనూ - MicTv.in - Telugu News
mictv telugu

టీ-శాట్ చానళ్లు ఇక ఎయిర్‌టెల్ డీటీహెచ్‌లోనూ

August 14, 2020

T-SAT network channels on Airtel DTH.

నిపుణులతో వీడియోల ద్వారా తెలంగాణ విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్న టీ-శాట్‌ విద్య, నిపుణ చానళ్లు ఇకపై ఎయిర్‌టెల్ డీటీహెచ్‌లో ప్రసారం కానున్నాయి. దేశంలోని కమ్యూనికేషన్ రంగంలో మూడవ స్థానంలో ఉన్న భారతీ ఎయిర్‌టెల్ డీటీహెచ్‌లో ఛానల్ నెంబర్లు 948, 949లలో  ప్రసారాలకు అనుమతిస్తూ టీ-శాట్ నెట్‌వర్క్‌‌తో ఎయిర్‌టెల్ సంస్థ గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. వివిధ సంస్థలతో టీ-శాట్ నెట్‌వర్క్‌ ఛానళ్లు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు టీ-శాట్ ఛానళ్లు విద్య, నిపుణ ప్రసారం చేసేందుకు అంగీకారం తెలిపింది. ఆగస్టు 15న 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టీ-శాట్, ఎయిర్‌టెల్ డీటీహెచ్ మధ్య కుదిరిన ఒప్పందంపై టీ‌-శాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి, భారతీ ఎయిర్‌టెల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఈవో అవనీత్ పురి గురువారం సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ, వారు హర్షం వ్యక్తం చేశారు. తొలిసారిగా టీ-శాట్ నెట్‌వర్క్ ఛానళ్లు భారతీ ఎయిర్‌టెల్‌లో ప్రసారం చేస్తున్నందుకు సీఈవో శైలేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపగా, ఏపీ సీఈవో అవనీత్ పురి తెలంగాణ ప్రభుత్వ సంస్థ టీ-శాట్ ద్వారా విద్యార్థులకు సేవలందించడం సంతోషంగా ఉందని అన్నారు. 

ఎయిర్‌టెల్ డీటీహెచ్‌తో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్‌లోనూ విద్యార్థులు టీ-శాట్ ప్రసారాలు చూడవచ్చని తెలిపారు. మరోవైపు శాటిలైట్, సోషల్ మీడియా వేదిక ద్వార డిజిటల్ ప్రసారాలు అందిస్తూ యూట్యూబ్‌లో నాలుగు లక్షల సబ్‌స్క్రైబర్లను కలిగివుంది. తెలంగాణ వ్యాప్తంగా డీటీహెచ్ ద్వార 10 లక్షలు, ఎక్స్‌ట్రీమ్ ద్వారా 1.5 కోట్ల  సబ్‌స్క్రైబర్లు కలిగి ఉండటమే కాకుండా 18 దేశాల్లో విస్తరించి ఉంది. డీటీహెచ్ మాత్రమే కాకుండా వైర్‌లెస్, మొబైల్, ఫిక్స్‌డ్ లైన్, హై స్పీడ్ ద్వార సేవలందిస్తూ దేశ వ్యాప్తంగా మార్చి-2020 వరకు 423 మిలియన్ కష్టమర్లను కలిగి ఉంది. దీంతో టీ-శాట్ నెట్‌వర్క్ ఛానళ్ల ప్రసారాలు దేశ వ్యాప్తంగా విస్తృతం అవనున్నాయి. కాగా, పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్ చదివే లక్షలాది మంది విద్యార్థులకు  ఇటీవలే తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా నేరుగా ప్రయోజనం చేకూరనుంది.