T20 match in Hyderabad... BCCI has finalized the schedule
mictv telugu

హైదరాబాదులో టీ20 మ్యాచ్.. షెడ్యూల్ ఖరారు చేసిన బీసీసీఐ

July 22, 2022

బీసీసీఐ హైదరాబాద్ క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్ చెప్పింది. రెండున్నర సంవత్సరాల తర్వాత నగరానికి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ను కేటాయించింది. సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ జరుగనుంది. మూడు మ్యాచుల ఈ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచులు మొహాలీలో సెప్టెంబరు 20న, నాగ్‌పూర్‌లో సెప్టెంబరు 23న, మూడో మ్యాచ్ హైదరాబాదులో సెప్టెంబరు 25న జరుగనున్నాయి. ఈ మేరకు బీసీసీఐ షెడ్యూల్ ఖరారు చేసి అధికారికంగా వెల్లడించింది. నగరంలో చివరి మ్యాచ్ 2019 డిసెంబరులో వెస్టిండీస్‌తో టీ20 జరిగింది. తర్వాత దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఉంది. వాటిని వరుసగా సెప్టెంబరు 28న తిరువనంతపురం, అక్టోబరు 1న గువాహటి, అక్టోబరు 3న ఇండోర్‌లో నిర్వహించనున్నట్టు బీసీసీఐ అధికారులు తెలిపారు. తర్వాత మూడు మ్యాచుల వన్డే సిరీస్ వరుసగా, అక్టోబరు 6న రాంచీ, అక్టోబరు 9న లక్నో, అక్టోబరు 11న ఢిల్లీలో జరుగుతాయి.