కేన్ విలియమ్సన్ స్పోర్ట్స్‌మెన్ స్పిరిట్ - MicTv.in - Telugu News
mictv telugu

కేన్ విలియమ్సన్ స్పోర్ట్స్‌మెన్ స్పిరిట్

November 1, 2022

T20 ప్రపంచ్ కప్ హోరాహోరీగా సాగుతోంది. సూపర్‌-12 దశలో రసవత్తర మ్యాచ్‌లు జరుగుతున్నాయి.ఇక బ్రిస్బేన్ వేదికగా గబ్బా మైదానంలో ఆసీస్, ఇంగ్లాడ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్స్‌న్ తన స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ చూపించాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాడ్ ఓపెనర్లు జోస్ బట్లర్, హేల్స్ ధాటిగా ఆడారు. ఈ క్రమంలో 5.2వ ఓవర్లో బట్లర్ కొట్టిన బంతిని కేన్ విలియమ్స‌ న్ అద్భుతంగా అందుకున్నాడు.

వెనక్కు తిరిగి డైవ్ చేస్తూ క్యాచ్ పట్టాడు. దీంతో ఇంగ్లాడ్ ప్లేయర్స్ అంతా సంబరాల్లో మునిగిపోయారు. బట్లర్ కూడా పెవిలియన్ చేరేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఇంతలో విలియమ్సన్‌కు ఆ క్యాచ్‌పై డౌట్ వచ్చింది. థర్డ్ అంపైర్‌‌కు రిఫర్ చేయమని అంపైర్‌కు తెలిపాడు..దీంతో రీప్లేలో అది నాటౌట్ గా తేలింది.. క్యాచ్ పట్టే సమయంలో బంతి నేలను తాకినట్లు స్పష్టంగా కనిపించింది. క్యాచ్‌పై డౌట్‌తో అంపైర్‌ను ఆశ్రయించిన కేన్ మామా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్‌ను నెటిజన్లతోపాటు క్రికెటర్లు కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.