t20 world cup India-Pakistan match Virat Kohli no ball controversy
mictv telugu

కోహ్లీ చారిత్రక ఇన్నింగ్స్‌పై పాకిస్తాన్ కుట్ర.. తెరపైకి ‘నో బాల్’ వివాదం.. అసభ్యకర వ్యాఖ్యలు

October 24, 2022

ఆదివారం క్రికెట్ మ్యాచ్.. భారత్ కి ఒకరోజు ముందే దీపావళిని తీసుకొస్తే.. పాకిస్తాన్ కి పీడకలని మిగిల్చింది. మెల్‌బోర్న్ గ్రౌండ్‌లో జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా ముగియడంతో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ చారిత్రక మ్యాచ్ ఓటమిని జీర్ణించుకోలేని పాకిస్తాన్ ప్లేయర్స్ టీమిండియా విజయాన్ని వివాదం చేస్తున్నారు. 20వ ఓవర్‌లో పాక్ స్పిన్నర్ నవాజ్ వేసిన ఫుల్‌ టాస్‌ ని కోహ్లీ మిడ్‌ వికెట్‌పై సిక్స్‌ బాదాడు. అయితే ఆ బంతిని అంపైర్లు నో బాల్‌ గా ప్రకటించారు. దీంతో భారత్‌కు 3 బంతుల్లో కేవలం 6 పరుగులు స్వల్ప టార్గెట్ తో పాటు ఫ్రీ హిట్ లభించింది. ఆ తరువాతి ఫ్రీ హిట్ బంతికి కోహ్లీ బోల్డ్ అయినా.. భారత్ కి మూడు పరుగులు లభించాయి. అయితే అవుట్ ఇవ్వాలీ లేదా మూడు పరుగులు రద్దు చేయాలన్నట్టుగా పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ అంపైర్లని తీవ్ర ఒత్తిడి చేశాడు.

కాని అంపైర్లు తమ నిర్ణయానికే కట్టుబడ్డారు. ఇప్పుడు ఇదే విషయాన్నీ పాకిస్తాన్ కాంట్రవర్సీ చేస్తుంది. కోహ్లీ బోల్డ్ అయినా.. బాల్ ఆఫ్ స్టంప్స్ నుండి థర్డ్ మ్యాన్ బౌండరీకి దూసుకెళ్లడంతో భారత బ్యాటర్లు మూడు పరుగులు సాధించారు. దాన్ని డెడ్ బాల్‌ గా అంపైర్లు డిక్లేర్ చేయాల్సిందని.. కానీ తమపై కుట్రతోనే డెడ్ బాల్ గా ప్రకటించలేదని పాకీలు వాపోతున్నాయి. ఇక కోహ్లి అడగ్గానే నో బాల్ ఎలా ఇస్తారని పాకిస్థాన్ అభిమానులు ప్రశ్నిస్తు్నారు. విరాట్ క్రీజ్ వదిలి బయటకు వచ్చాడు కాబట్టి అది నో బాల్ కాదని వాదిస్తున్నారు. నో బాల్‌ను ఎందుకు సమీక్షించలేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అంపైర్లను ప్రశ్నించాడు. అంపైర్లు భారత్‌కు అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాసీర్ హుస్సేన్ వ్యాఖ్యానించాడు. కానీ ఐసీసీ, బీసీసీఐని అప్‌సెట్ చేయొద్దని కారణంతో మనం సైలెంట్‌గా ఉందామంటూ అడ్డమైన సెటైర్లు వేశాడు.