T20 World Record 501 Runs Scored In South African Domestic Match
mictv telugu

టీ20ల్లో ప్రపంచ రికార్డు.. ఒకే మ్యాచ్‌లో 501 పరుగులు..

November 2, 2022

టీ20 క్రికెట్‌లో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ఇరుజట్లు క్రికెటర్లు. దక్షిణాఫ్రికా దేశవాళీ మ్యాచ్‌లో టీ20 ప్రపంచ రికార్డు నమోదు చేశారు. రెండు జట్లు కలిపి 500కి పైగా పరుగులు నమోదు చేశాయి. సీఎస్ఏ టీ20 ఛాలెంజ్‌లో టైటాన్స్-నైట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరుజట్లు కలిపి 501 పరుగులతో రికార్డు సృష్టించాయి. సీఎస్ఏ టీ20 ఛాలెంజ్ అనే ఈ సౌతాఫ్రికా దేశవాళీ టోర్నీలో టైటాన్స్-నైట్స్ అనే ఫ్రాంఛైజీ జట్లు పోటీ పడగా.. రెండు టీమ్స్ కలిపి 501 పరుగులతో రికార్డు సృష్టించాయి.

ముందు బ్యాటింగ్ చేసిన టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేయగా.. అనంతరం ఈ భారీ లక్ష్య ఛేదనలో నైట్స్ జట్టు 9 వికెట్ల నష్టానికి 230 పరుగుల చేసి 41 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ ఇరుజట్లు కలిపి 36 సిక్సర్లు నమోదయ్యాయి. ఇరు జట్లు కలిపి 501 పరుగులు చేయడం ఇదే మొదటిసారి. టైటాన్స్‌ ఆటగాడు, బేబీ ఏబీ అని ముద్దుగా పిలుచుకునే డెవాల్డ్‌ బ్రెవిస్‌ 57 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్సర్లతో 162 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 36 సిక్సర్లు నమోదయ్యాయి.