ఆ హీరో జెయ్యవట్టే నాకు లగ్గం కాలేదు..? - MicTv.in - Telugu News
mictv telugu

ఆ హీరో జెయ్యవట్టే నాకు లగ్గం కాలేదు..?

June 29, 2017

గ్రీకు వీరుడు నా రాకుమారుడు అంటూ కుర్రాళ్ల మన్సు దోచుకున్న హీరోయిన్ టాబూ ..లేడి బ్రహ్మచారిని కానీకి కారణం ఈ హీరోనేనట… ఇంతవరకు లగ్గం జేస్కోలేదంటే అంతా ఆ హీరో ఫుణ్యమే అంటుంది,ఇంతకీ ఆ హీరో ఎవరంటే హిందీ హీరో అజయ్ దేవగన్ అట,ఇరవై ఐదేండ్లకింద మా కజిన్ ఇంటిపక్కపొంటే ఈ అజయ్ దేవగన్ ఉండెటోడు…నేనేడికెళ్లినా  మా కజిన్ మరియు ఈ హీరోగారు నన్ను ఫాలో అయ్యెటోళ‌్లు…ఎవలన్న అబ్బాయిలు నావంక సూశి మాట్లాడ్తె సాలు అచ్చి ఆళ‌్లకు ఇంకో సారి  మాట్లాడితే మంచిగుండది అని దమ్కీలిచ్చెటోళ్లు…ఇగ అప్పటిసుంది ఏ అబ్బాయి నాదగ్గరికచ్చి మాట్లాడనీకి బుగులు వడ్తుండే అందుకే నాకు ఇంకా పెండ్లికాలేదు,అప్పుడు అజయ్ దేవ్ గన్ తను చేసిన తప్పుకు ఇప్పటికైనా పచ్చాతాప పడతాడని ఆశిస్తున్నా అని సరదాగ చెప్పుకొచ్చింది,అంతేగాదు మంచి అబ్బాయుంటే సూడుమనిగుడ ఆ హీరోగారికే చెప్పిందట.

సో టాబూను ఆరాధ్యదేవతగ కొల్సుకొని గడ్డాలు మీసాలు పెంచుకున్న అబ్బాయిలు…ఉత్తగనే గ హీరోయిన్ ఫోట్వను పర్సుల వెట్కుంట.. ఆమె రూపాన్ని గుండెల్ల వెట్కొని దేవదాసులై టైం వేస్టు జేస్కోకుంట…ఎంబట్నే మీరు అజయ్ దేవగన్ సారు కండ్లల్ల పడనీకి ట్రై జెయ్యుండ్రి…ఒకవేళ మీరు నచ్చితే…నిన్నే పెళ‌్లాడతా అని టాబూమేడమే మీ ఎంబట వడ్తదేమో ఎవలికి దెల్సు.ట్రై మార్కే దేఖో బాయ్.