Taapsee Boult's comment on 'Koffee with Karan Show'..
mictv telugu

‘కాఫీ విత్‌ కరణ్‌ షో’పై తాప్సీ బోల్డ్ కామెంట్..

August 8, 2022

బాలీవుడ్‌లో ప్రస్తుతం మంచి రేటింగ్‌తో దూసుకుపోతోన్న ‘కాఫీ విత్ కరణ్’ రియాల్టీ షోపై ప్రముఖ హీరోయిన్ తాప్సీ సంచలన బోల్డ్ కామెంట్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీని యాంకర్..’కాఫీ విత్ కరణ్ షో’కు మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించడం లేదు’ అని అడిగింది. దానికి తాప్సీ.. ”కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొనేంత గొప్పగా నా శృంగార జీవితం లేదు” అంటూ బోల్డ్‌ సమాధానం ఇచ్చింది.

తాజాగా తాప్సీ నటించిన చిత్రం ‘దోబారా’. ఈ చిత్రం ఆగస్టు 19న విడుదల కానుంది. ఈ క్రమంలో తాప్సీ గతకొన్ని రోజులుగా సినిమా ప్రమోషన్స్‌ కోసం వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఇటీవలి కాలంలో హీరో, హీరోయిన్స్‌ ఎక్కువగా తమ మూవీని ప్రమోట్ చేసుకోవటం కోసం ‘కాఫీ విత్‌ కరణ్‌’ సీజన్‌-7లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే, తాప్సీ మాత్రం ఆ షోకి వెళ్లకపోవడంపై మీడియా నుంచి ఆమెకు ఈ ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం తాప్సీ చేసిన ఈ బోల్డ్‌ ఆన్సర్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మరోపక్క ఇప్పటివరకు కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొన్న సెలబ్రిటీలకు కరణ్‌ శృంగార జీవితం(సెక్స్‌ లైఫ్‌)పై అనేక ప్రశ్నలు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండను సైతం శృంగార జీవితానానికి సంబంధించి ప్రశ్నలు వేశారు. దానికి విజయ్.. సమాధానం చెప్పాలా? వద్దా? అనే అనుమానంతో కొంచెం తడబడ్డాడు. ఈ క్రమంలో తాప్సీ ఎందుకు ఆ షోలో పాల్గొనటం లేదు అనే ప్రశ్న ఆమెకు ఎదురుకాటంతో ఈ బోల్డ్‌ సమాధాని ఇచ్చింది.