ఆ ముగ్గురే బాలీవుడ్ ఐకాన్స్.. తాప్సీ
కంగన గురించి మాట్లాడుతూ.. తనకు కావాల్సిన దాని కోసం గళమెత్తి మాట్లాడుతుంది, అది చాలా గొప్ప విషయం అని చెప్పింది. ఇక అనుష్క శర్మ గురించి చెబుతూ.. చాలా నిజాయితీగా ఉంటారు.. అందుకే వీరి ముగ్గురి పేర్లు చెప్పాను అని తాప్సీ అన్నది. ‘నా దృష్టిలో ఫెమినిజానికి సరైన అర్థం పురుషులతోపాటు సమానంగా అవకాశాలు రావడం. మన నైపుణ్యాన్ని అందరికీ తెలియజేయాలంటే ముందు అవకాశం రావడం కూడా చాలా ముఖ్యం’ అని చెప్పింది తాప్సీ.
ఇటీవల కంగన సోదరి రంగోలి తనపై చేసిన చీప్ కామెంట్ల గురించి తాప్సీ స్పందించింది. ‘రింగురింగుల జుట్టు కంగనకు ఉందని, నేనూ రింగుల జుట్టుతో పుట్టలేదు. దీనికి నా తల్లిదండ్రులు బాధ్యులు. కాబట్టి దానికి నేను క్షమాపణ చెప్పలేను. నేను కంగనాను కాపీ కొట్టలేదు. ఏం కాపీ కొట్టానో నాకే తెలియదు. ఓ మంచి నటికి నేను కాపీ అయితే సంతోషమే. దీన్ని విమర్శగా కాకుంగా ప్రశంసగా తీసుకుంటాను. నేను భారీ పారితోషికం తీసుకునే నటిని కాదు. అందుకే రంగోలి నన్ను చీప్ నటి అందేమో. ఇందులో బాధపడాల్సిన అవసరం లేదు’ అని తాప్సీ చెప్పింది. తాప్సీ ఇటీవల ‘మిషన్ మంగళ్’ చిత్రంలో నటించిన విషయం తెెలిసిందే. ఈ సినిమా బాక్సీఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది.